"SAFEW"
విశ్వ వ్యాప్త జీవకోటి మనుగడకు ఆధారమైనవి, ఆకాశం(Sky), గాలి(Air), నిప్పు(Fire), భూమి(Earth), నీరు(Water)
"SAFEW" అనే ఈ పంచ భూతాలు. వీటి పరిరక్షణ ప్రపంచ మానవాళి ముందున్న తక్షణ కర్తవ్యం. భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుదల, ప్రతికూల వాతావరణ మార్పులు, ఓజోను పొరకు ముప్పు, మంచు కరిగిపోవటం, సముద్ర మట్టాలు వేగంగా పెరగటం, పెను తుఫాన్లు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి, మనము, మన భావి తరాలు బలి కాక ముందే శాశ్వత పరిష్కారాన్ని కనుగొని అమలు చేయాలి.
అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలు, పర్యావరణానికి కీడు చేస్తోంది మీరంటే, మీరని ఒకరినొకరు నిందించుకుంటూ, ఎవరి పాత్ర ఎక్కువనే లెక్కలు వేసుకోవటం మాని, అందరికీ ఆమోద యోగ్యమైన మార్గాన్ని ఎంచుకుని, ఆవైపుగా ముందడుగు వేయాలి. ఇందుకు మొదటగా మానవ జాతి మొత్తం అత్యవసరంగా అనుసరించాల్సిన ఏకైక పధ్ధతి "ప్రకృతి తో సహజీవనం"
పర్యావరణ పరిరక్షణ పేరుతో అడవులు సంరక్షించటం, మెుక్కలు పెంచటం వంటి కొన్ని కార్యక్రమాలకే పరిమితమవుతున్నాము.
నిజానికి ప్రకృతికి, ఇతరత్రా జీవకోటికి ఎన్నోవిధాలుగా నష్టం కలగజేస్తున్నది మానవజాతి ఒక్కటే.
ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు అతిగా వాడుతూ (ఆకాశానికి) ఓజోనుకు చిల్లులు పెడుతున్నదీ మనమే.
రవణా అవసరాలకు పెట్రోల్, డీజల్ విపరీత వాడకంతోపాటు, భారీ కర్మాగారాల ద్వారా వాయు (గాలి) కాలుష్యాన్ని పెంచుతున్నదీ మనమే.
చెరువులూ, కుంటలు పూడ్చి అపార్ట్ మెంట్లు కట్టి భూ గర్భంలోకి బోర్లు వేసి జలవనరులు (నీరు) తోడేస్తున్నదీ మనమే.
ఎరువులు, పురుగుమందులు వంటి రసాయనాల వాడకంతో ధరిత్రి (భూమి) ని విషమయంగా మారుస్తున్నదీ మనమే.
పెట్రోలియం ఉత్పత్తులు (నిప్పు) విచ్చలవిడి వాడకంతో కాలుష్య కొలిమిని రాజేస్తున్నదీ మనమే.

ఇలా ప్రకృతిలోని పంచభూతాలకు విఘాతం కలిగిస్తున్న మనుషులలో (మనలో) వాస్తవికమైన మార్పు ద్వారానే, వీటి పరిరక్షణ సాధ్యమవుతుంది. ఇందుకు తగిన అవకాశాలను ప్రభుత్వాలు కల్పించాలి.
ప్రపంచమంతా ఎన్ని సరికొత్త ప్రయోగాలు చేసి విజయాలు సాధించినా, సాంకేతికంగా ఎంత అభివృధ్ధి చెందినా, ప్రకృతికి తలవంచుతూ, సహజ సిధ్ధమైన జీవనశైలి ద్వారా మాత్రమే మానవజాతి మనుగడ సాగించగలదనే వాస్తవాన్ని గుర్తించాలి.
మొక్కలు పెంచటం, అడవులు పెంపొందించటం, పశుపాలన, నీటి భద్రత, భూ సంరక్షణ వంటి ప్రకృతి పరిరక్షణ కార్యక్రమాలను, ప్రభుత్వాలు వేరు వేరు పథకాల రూపంలో కాకుండా, దైనందిన జన జీవన విధానంలో భాగంగా, ప్రజలు ఆచరించే పరిస్థితులు కల్పించాలి.

No comments:
Post a Comment