మెట్రో లాజిస్టిక్ సర్వీసెస్
భారతదేశంలో జనాభా అధికంగా ఉన్న పెద్ద నగరాలలో లోకల్ ట్రైన్, మెట్రో రైల్ సదుపాయాలు విస్తరిస్తున్నాయి.
ప్రజా రవాణా వ్యవస్థలుగా పరిమితమైన లోకల్ ట్రైన్, మెట్రో రైల్ సర్వీసులు ఉదయం 5గంటల నుంచి రాత్రి 11గంటలు వరకు రాకపోకలు సాగిస్తున్నాయి.
ఈ లోకల్ ట్రైన్, మెట్రో రైల్ సర్వీసులలో రాత్రి వేళల్లో సరుకు రవాణాకు అవకాశం కల్పించి పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు అనేది నా సరికొత్త ఆలోచన.
ముందుగా మహా నగరాలలోని లోకల్ ట్రైన్స్, మెట్రో రైల్వే వ్యవస్థల మధ్య సరకు రవాణాకు సంబంధించి అనుసంధానం చేయాలి.
రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటలు వరకూ ఖాళీగా ఉండే లోకల్ ట్రైన్స్, మెట్రో రైల్వే ట్రాకులు, స్టేషన్లు చిన్న తరహా సరుకు రవాణాకు (Logistic)ఉపయోగించుకోవచ్చు.
ఇదే సమయంలో రోజువారి జరిగే లోకల్ ట్రైన్, మెట్రో రైల్ వ్యవస్థల సాధారణ నిర్వహణను (Maintenance) ఎక్కువ పని వారిని నియమించి, తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు.
మెట్రో లాజిస్టిక్ సర్వీసెస్ ఏర్పాటుకు సరుకు రవాణా కోచ్ లు (Goods Bogies) స్టేషన్ల వద్ద లోడింగ్, అన్ లోడింగ్ సదుపాయాలు కల్పించవలసి ఉంటుంది. లోకల్ ట్రైన్, మెట్రో రైల్ కంపెనీలు ఈ తరహా మౌలిక వసతులు అందించి, లాజిస్టిక్ సర్వీసెస్ నిర్వహణలో అనుభవం, సమర్ధత కలిగిన పెద్ద కంపెనీలకు సరుకు రవాణాకు దీర్ఘ కాలిక లీజుకు ఇవ్వటం ద్వారా ఆదాయం పొందవచ్చు.
లాజిస్టిక్ సర్వీసెస్ నందు అనుభవం ఉన్న కంపెనీలు, మెట్రో నగరాల పరిధిలోని చిన్న సంస్థలతో ఒప్పందాల ద్వారా భారీగా ఇంటర్ సిటీలాజిస్టిక్ రవాణాకు అవకాశం ఏర్పడుతుంది.
ఈ మొత్తం ప్రక్రియ ద్వారా కొత్త తరహా వ్యాపార వ్యవస్థ తయారవటమే కాక, లోకల్ ట్రైన్, మెట్రో రైల్ కంపెనీలకు అదనపు ఆదాయం, ఉద్యోగాల కల్పన, నగర ట్రాఫిక్ కొంత మేర తగ్గుదల, అన్నిటికి మించి నగర వాతావరణ కాలుష్య నియంత్రణ, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం తగ్గించవచ్చు.

మహానగరాలలో ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైల్ వ్యవస్థను, ఐదు నుంచి పది లక్షల జనాభా కలిగిన అన్ని నగరాలకు విస్తరించాలి. అయితే గత మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ నిర్మాణాల మాదిరిగా బడా కాంట్రాక్టు సంస్థలకు అప్పగించే విధానానికి ప్రభుత్వాలు స్వస్తి పలకాలి. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఆయా రాష్ట్రాల రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ సంస్థలను అభివృధి పరచాలి. అంటే రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలను, రైల్ రోడ్ రవాణా సంస్థలుగా మార్చుకోవాలి. ప్రస్తుతం అన్ని ప్రధాన నగరాల నుంచి వంద కిలోమీటర్ల పరిధిలోని ఇతర నగరాలూ, పట్టణాలు, గ్రామాలకు ప్రతి పది నిమిషాలకు ఒక్కో బస్సు చొప్పున రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ మార్గాలలో మెట్రో రైల్, మోనో రైల్ ఏర్పాట్లు రాష్ట్ర రైల్ రోడ్ రవాణా సంస్థల ఆధ్వర్యంలో జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని అనుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి. ఆయా సంస్థల ప్రస్తుత స్థాయి, ఆస్తుల విలువ ఆధారంగా, విదేశీ రుణాలు, కేంద్ర సహాయం ద్వార స్వంతంగా నిర్మాణ, నిర్వహణకు అవకాశం కల్పించాలి.
నగరాలలో వ్యక్తిగత కార్లు, టూవీలర్లు విపరీతంగా పెరిగి కాలుష్యాన్ని, ట్రాఫిక్ సమస్యలను సృష్టిస్తున్నాయి. వీటికి వాడుతున్న ఇంధనాలు కూడా, విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి దిగుమతి చేసుకుంటున్నాము. కాలంతో పోటీపడుతున్న నగర జీవన క్రమంలో, కాలుష్యం లేని సైకిల్స్ వాడమంటే ఎవరికీ అంత ఓపిక, తీరిక లేవు. స్వంత వాహనాలు ఒదిలేసి బస్సుల్లో తిరగాలంటే పొల్యుషన్, ట్రాఫిక్ జామ్, విపరీతమైన రద్దీ వంటి సమస్యలు అంతకంతకు పెరిగి భయపెడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజా రవాణా వ్యవస్థను, వేగవంతమైన, భద్రతతో కూడిన, తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే జనం స్వంత వాహనాలను పక్కనపెట్టి సౌకర్యవంతమైన మెట్రో రైల్, మోనో రైల్ సేవల వైపు ఆకర్షితులవుతారు. అందుకు ప్రస్తుతం సిటీ, సబర్బన్, మెట్రో, నాన్ స్టాప్ బస్సులను నడుపుతున్న రాష్ట్రాల ఆర్ టి సి సంస్థలు తమ ఆదాయాన్ని నష్టపోకుండా, మెట్రో రైల్, మోనో రైల్ నిర్మాణ, నిర్వహణలను అప్పగించి బలోపేతం చేయాలి. జన సంచారం తక్కువగా ఉండే రాత్రి వేళల్లో ఈ మెట్రో రైల్, మోనో రైల్ సర్వీసుల ద్వార మధ్య స్థాయి సరుకు రవాణాకు అవకాశం కల్పించాలి. అందుకు అవసరమైన బోగీలు, ఎగుమతి, దిగుమతులకు సదుపాయాలు సమకూర్చాలి. మహానగరాలలో మధ్యతరహా సరుకు రవాణాకు లోకల్ ట్రైన్స్, మెట్రో రైల్, మోనో రైల్ సర్వీసుల మధ్య అనుసంధానం ఏర్పరిచి, రాత్రి వేళల్లో విస్తృతంగా వినియోగించుకోవచ్చు. దీనివలన నగరాలలో పగటివేళ లాజిస్టిక్ ట్రక్కులు, ఆటోల వాళ్ళ ఏర్పడే ట్రాఫిక్ సమస్య నియంత్రించవచ్చు. అదే స్థాయిలో నగర కాలుష్యం కూడా తగ్గించవచ్చు.
ఈ విధమైన ఏర్పాటు ద్వారా ప్రస్తుతమున్న బస్ సర్వీసులు సరైన రవాణా సదుపాయాలు లేని మారుమూల పల్లెలకు పంపే అవకాశం కలుగుతుంది. దీని వలన ప్రధాన మార్గాలలో కాలుష్య రహిత ప్రజా రవాణా అందుబాటులోకి వచ్చి, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి తగ్గి, విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవచ్చు.
No comments:
Post a Comment