Thursday, 27 September 2018

గ్రీన్ సిటీస్


గ్రీన్ సిటీస్
భారత దేశంలో అందరికి సొంత ఇల్లు ఏర్పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం  '2022' సంవత్సరం వరకు టైం లిమిట్ పెట్టుకొని పని చేస్తోందిఅయితే ప్రజలకు ఇది ఒక ఉద్ధరింపు పధకంలా గాకదేశ ఆర్ధిక ప్రగతికి ఉపయోగపడే ఆయుధంగా మార్చాలనేది నా మనవిపెద్ద సంఖ్య లో దేశం మొత్తం స్మార్ట్ సిటీస్ కూడా అభివృద్ధిచేయాలనుకుంటున్న ప్రభుత్వంఅందులో భాగంగానే ఇళ్ళ నిర్మాణాన్ని చేస్తే బహుముఖ ప్రయోజనంగా ఉంటుందిఅయితే ఇప్పటి వరకు రోడ్డు మార్గం ఆధారంగా ఇళ్ళ నిర్మాణాలు జరిగాయిఇప్పుడు రైల్వే ట్రాక్ వెంటమహా నగరాలకి యాభై కిలోమీటర్ల పరిధిలోని చిన్న స్టేషన్ల కేంద్రంగా రెసిడెన్షియల్ కాలనీల నిర్మాణం చేయాలిఅయితే నగరాలను కాంక్రీట్ జంగిల్స్ గా మార్చిన అపార్ట్ మెంట్ నిర్మాణాల జోలికి వెళ్ళకుండా ఇండిపెండెంట్ ఇళ్ళు కట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాలిదేశమంతా ఆఫీసులువ్యాపార సంస్థలు మినహాయించినివాసానికి బహుళ అంతస్తుల భవనాలు కట్టకుండా చట్టం చేయాలి. ఇది కొంత అతిశయోక్తిగా అనిపించవచ్చు. అంత భూమి ఎక్కడిది, పంటపొలాలు నాశనం చేయాలా, అడవులు నరికివేస్తారా అనే అనుమానాలు రావచ్చు. వాస్తవంగా చుస్తే ప్రపంచ భూభాగంలో మానవ నివాసాలకు వినియోగిస్తున్నది కేవలం మూడు శాతం మాత్రమే. అందుకే ఇంత కాలుష్యమా అనే అనుమానం రావచ్చు. కానీ మనం చేస్తున్నది ప్రకృతికి హానికలిగించే అభివృద్ధి.        
పెద్దయెత్తున అపార్ట్ మెంట్ నిర్మాణాల వలన ప్రకృతికీభూమికి జరుగుతున్న అపార నష్టాన్ని గుర్తించాలి
ఆరు వందల గజాల స్థలంలో నాలుగు ఇండిపెండెంట్ ఇళ్ళు కట్టే చోటఐదు అంతస్తుల భవనం కట్టి, అందులో ఇరవై ఫ్లాట్స్ నిర్మిస్తున్నారుఅంటే నాలుగు కుటుంబాలు నివసించే భూమిని ఇరవై కుటుంబాలకు విస్తరించారు 20 కుటుంబాల నీటి అవసరానికిఎంత లోతుకైనా బోరు వేయడంభూగర్భ జలాలన్ని తోడెయ్యడం నగరాల్లో రోజూ జరుగుతున్నప్రకృతి వినాశనంఅంటే సహజ సిద్దంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకే వీలు లేకుండా అపార్ట్ మెంట్లు నిర్మించి నాలుగు కుటుంబాలు వాడుకోవలసిన నీటిని '20' కుటుంబాల కోసం ఎక్కువ లోతులోపెద్ద-పెద్ద బోర్లు వేసి లాగేయడం జరుగుతోందిఅంతే కాదు జీవనాధారమైన ఆక్సిజన్ ను అందించే చెట్లను పెంచడానికి వీలు లేకుండాఉన్నవి కొట్టేసి పెద్ద ఎత్తున కడుతున్న అపార్ట్ మెంట్ల వల్ల ప్రకృతి సమతుల్యం వేగంగా దెబ్బ తింటోందిచెట్లు ఉంటే ఇతరత్రా జీవరాశులుఉడుతతొండఎలుకచిన్న చిన్న పురుగులువాన పాములువంటివి కాలానుగుణంగా భూమికిమనుషులకిప్రకృతికిమధ్య సమతుల్యానికి ఉపయోగపడతాయిదేశం మొత్తంలో ప్రతి ఇంటికి ఒక ఆవు(గోమాత)ను పెంచితే మానవ జాతి అంతటికి ఆరోగ్యంసుభిక్షం సహజ సిద్ధంగా లభిస్తాయి
    కనీసం 200 గజాల్లో ఇండిపెండెంట్ ఇళ్ళ నిర్మాణం వలన ఎక్కువ భూ విస్తీర్ణంలో తక్కువ భూగర్భ జలాల వినియోగం వలన భూమి అడుగు పొరల్లో సమతుల్యత ఏర్పడి నీటి నిల్వలు పెరుగుతాయిఊరే అవకాశం ఇవ్వకుండా నీరు తోడితే,ఎంతటి బావి అయినా ఇంకి ఎండిపోవడం ఖాయంరెండు వందల గజాల స్థలంలో 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం చేసిమిగిలిన స్థలంలో కనీసం నాలుగు చెట్లు పెంచే విధంగా అవకాశం ఏర్పరచాలి
 స్థలంలో ఎటువంటి అదనపు నిర్మాణానికి అవకాశం లేకుండాస్థానిక ప్రభుత్వాల ద్వారా నియంత్రించాలిమరీ అవసరమైతే డబుల్ బెడ్ రూమ్ విస్తీర్ణంలోనే మొదటి అంతస్తు నిర్మాణానికి అనుమతించాలిఇంట్లో చెట్లను గానిరోడ్లపై చెట్లను గాని ఎట్టిపరిస్తితులలో తొలగించటానికి వీలు లేకుండా చట్టాలు చేయాలి.         
భూమి విలువలు పెరగడంజనావాసాలకు కొరత ఉండటం వాస్తవమేఅయితే అపార్ట్ మెంట్ల నిర్మాణమే అందుకు పరిష్కారంగా భావించి ప్రోత్సహిస్తేభవిష్యత్ తరాలు భూగర్భ జలాలు లేకభూమి పొరల్లో సంభవించే పెను మార్పులకు బలి కావాల్సివస్తుంది పరిస్థితిని అధిగమించేందుకునగరాలకు దగ్గరలోని రైల్వే స్టేషన్ల వద్ద సకల సౌకర్యాలతో టౌన్ షిప్  నిర్మాణం చేపట్టాలి స్టేషన్  మీదుగా ప్రధాన నగరానికి నిరంతరం లోకల్ ట్రైన్స్ నడిచే ఏర్పాటు చేయాలిఅందుకు అవసరమైన ప్రత్యేక లైన్ లు నిర్మించుకోవాలికేంద్రరాష్ట్రస్థానిక ప్రభుత్వాల సమన్వయము తో భూమిని గుర్తించి సేకరిస్తే '5' లక్షల రూపాయలతో అన్ని సౌకర్యాలతో అందరికి ఇండిపెండెంట్ ఇళ్ళు కష్టమేమి కాదువీటిని గ్రీన్ సిటీస్ గా అభివృద్ధి చేస్తే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందిగ్రీన్ సిటీస్ అంటేనిర్మాణ సమయంలోనే రోడ్ల వెంట ఎటువంటి మొక్కలు నాటితే ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తూ చల్లదనాన్ని అందిస్తాయిఅవి  డైరెక్షన్ లో నాటితే చెట్లుగా పెరిగి ఆప్రాంతమంతా సమశీతోష్ణ స్థితిని కలుగజేస్తాయిఇంటికి రెండు వేప చెట్లు ఆరోగ్యాన్ని ఎలా కాపాడతాయి అనే బహుముఖ విషయాలను విశ్లేషించి నగరాలను నిర్మించటందీని ద్వారా కృత్రిమ సమశీతోష్ణ స్థితిని అందిస్తున్న ఎయిర్ కండిషనర్లురిఫ్రిజిరేటర్ల వాడకాన్ని అవసరం లేని కారణంగా ప్రజలు స్వచ్చందంగా ఆపివేస్తారు
గ్రీన్ సిటీస్ నిర్మాణంతోసీలింగ్ ఫ్యాన్ వాడకం కూడా అవసరంలేని చల్లనైన వాతావరణాన్ని సహజ రీతిలో కల్పించవచ్చు.    
 గ్రీన్ సిటీస్లో భాగంగానే సంపన్నమధ్య తరగతినిరుపేదలు ఇలా వర్గాలవారిగా వారి స్తోమతను బట్టిపరస్పర అవసరాలను గుర్తిస్తూ ఇళ్ళను నిర్మించవచ్చు
ప్రభుత్వ వ్యవస్థల్లో పెద్దమొత్తంగా ధనం వృధా అయ్యేదిరోడ్లు వేసిన తర్వాత డ్రైనేజ్ నిర్మాణం కోసం తవ్వేయటండ్రైనేజ్ పనులు పూర్తయ్యాక వాటర్ పైప్ లైన్స్ ఏర్పాటుకోసం మళ్లీ తవ్వటం ఇలా పలు శాఖల మధ్య సమన్వయం లేక మళ్లీ మళ్లీ నిర్మాణాలు చేయాల్సి రావటం ప్రధాన కారణం.   
   వాస్తవాన్ని ప్రభుత్వాలు గుర్తించి గ్రీన్ సిటీస్ నిర్మాణ సమయంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్వాటర్ పైప్ లైన్స్గ్యాస్ పైప్ లైన్స్ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్రోడ్స్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలిఅదే సందర్భంలో నీటి నిల్వకు సరోవరాలుఉద్యానవనాలుస్కూల్స్కాలేజీలుఆసుపత్రులుకమ్యూనిటి హాల్స్ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలుపశు పాలక కేంద్రాలుమాల్స్షాపింగ్ కాంప్లెక్స్ లుప్రార్ధనా స్థలాలుస్మశాన వాటికలు వంటి నిర్మాణాలకు అనువైన స్థలాలు గుర్తించి ఏర్పాటు చేయాలి.  
ఒకే ప్రాంతంలో గ్రూపుగా కొన్ని వేల ఇళ్ళ నిర్మాణం అంటే అందుకు అవసరమయ్యే  స్టీలుసిమెంటు వంటి నూట యాభైకి పైగా రంగాల ఉత్పాదనలకు అవసరం ఏర్పడుతుందిఆయా రంగాలను గుర్తించి యాభై కిలోమీటర్ల పరిధిలో వాటి ఉత్పత్తులు తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తేరవాణా వ్యయం నియంత్రించవచ్చు
చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతుందిభూమిప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వాలు ఇటువంటి నిర్మాణాలకు ఉపక్రమించాలిబహుళ అంతస్థుల భవనాలే అభివృద్ధికి సూచికగా భావిస్తేభూగర్భంలో కలిసిపోయే ప్రమాదాన్ని విస్మరించ కూడదుప్రజలకి ఇళ్ళు అవసరం అవసరాన్ని ప్రభుత్వాలు తక్కువ ఖర్చులో తీర్చుతూఅందుకు వివిధ రంగాల ఉత్పాదకతకు ప్రోత్సాహమిస్తూతద్వారా ఉపాధి అవకాశాలను పెంచటమే దేశ ఆర్ధిక ప్రగతికి సోపాన మార్గం.

No comments:

Post a Comment