పెట్రోలియం ప్రొడక్ట్స్ లేకపోతే ?
అవును భారతదేశంలో పెట్రోలియం ప్రొడక్ట్స్ లేకపోతే? నిజమే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయనే గోల ఉండదు. వాటి కోసం పెద్దమొత్తంలో విదేశీ మారకద్రవ్యం సమర్పించుకోనక్కరలేదు. పెట్రోలియం ప్రొడక్ట్స్ అధిక వినియోగం వల్ల పెరుగుతున్న కాలుష్య వ్యాప్తి ఆగిపోతుంది. వ్యక్తిగత వాహనాలు లేకపోతే ట్రాఫిక్ సమస్యే రాదు. శబ్ద కాలుష్యం ఉండదు.
అంతా బాగానే ఉంది, మరి సరుకు రవాణా, ప్రజా రాకపోకలు ఎలా?
సింపుల్, రవాణా రంగాన్ని రోడ్స్ వదిలేసి, రైల్వే ట్రాక్స్ పైకి మళ్లిస్తే చాలు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థను విస్తృత పరిచి, చీప్, సేఫ్, ఫాస్ట్ ప్రాతిపదికన ప్రజలకి అందుబాటులోకి తెస్తే, తప్పకుండా వినియోగిస్తారు.
కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ పై భారీగా పన్నుల రూపంలో ఖజానాలు నింపుకుంటున్న ప్రభుత్వాలు ఈదిశగా ఆలోచన చేస్తాయా? అనేది అనుమానమే. కనీసం ప్రజలైనా రోజూ ఆందోళనలు చేసే బదులు, శాశ్వత పరిష్కార దిశగా చైతన్యవంతులై ఇందుకు ఉద్యమించలేమా?
వాస్తవంగా మనదేశంలో విస్తృత వినియోగంలో ఉన్నపెట్రోలియం ప్రొడక్ట్స్ 82 శాతం ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకొంటున్నాము. మనకి అతి తక్కువ అందుబాటులో ఉన్న పెట్రోలియం ప్రొడక్ట్స్ వంటి వనరులను నిత్యావసరంగా మార్చి, తలసరి ఆదాయంలో పెద్దవాటాను విదేశాలకు చేల్లించుకోవలసిన దుస్థితి ఏర్పరచింది, మన ముందు తరం నాయకులే. వారి అనాలోచిత నిర్ణయాలేనని తెలుసుకోవాలి. అంతకుమించి ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ అమ్మకాల ద్వారా భారీగా పన్నులను వసూలు చేస్తూ, ప్రభుత్వాల ఆదాయవనరుగా మార్చారు. రోజు రోజుకీ పెట్రోలియం ప్రొడక్ట్స్ వినియోగం పెరిగిపోయి, వాటి కొనుగోలుకు పెద్ద మొత్తంలో దేశీయ ధనాన్ని విదేశాలకు చెల్లించుకుంటూ, వినాశనానికి కారణమయ్యే కాలుష్యాన్ని కొని తెచ్చుకుంటున్నాము. కనీసం ఇప్పటికైనా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయని ఈ పాలకుల వైఖరి, భవిష్యత్ తరానికి తీరని శాపంగా పరిణమించే ప్రమాదముంది.
కార్తికేయ మణికుమార్
సీనియర్ జర్నలిస్ట్
No comments:
Post a Comment