Thursday, 27 September 2018

జీవన శైలి


జీవన శైలి
  ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు మూలమైన ఎన్నో విషయాలు భారత ప్రాచీన విద్యా విధానం ద్వారా రూపొందినవే. సున్నా (జీరో) దశాంశ స్థానాలు వినియోగం నుంచి రాజనీతి శాస్త్రం వరకు ఎన్నింటినో మన పూర్వీకులు స్పష్టమైన వివరాలతో భావితరాలకి అందించారు. 
అద్భుత కట్టడాలను అలవోకగా నిర్మించిన ఇంజనీరింగ్ ప్రతిభ అప్పటికే మన సొంతం.
అరవైనాలుగు కళలలో ఆరితేరిన నైపుణ్యం భారతీయులదిఖగోళ విజ్ఞానంసూర్యచంద్రనక్షత్ర గమనాలను లెక్కలు 
కట్టి పౌర్ణమి , అమావాస్యగ్రహణాలను చెప్పిన చరిత్ర మనది.
అయితే బ్రిటీష్ వారి బానిసత్వంలో మనదేశంలోకి విదేశీ విద్యావిధానం చొరబడిందిమంచి ఎక్కడున్నా నేర్చుకోవటం తప్పుకాదుకానీ మన ఉనికి మరచి వాళ్ళ విధానాలకు ఆకర్షితులయ్యాముఫలితంగా విద్య ద్వారా విజ్ఞానవంతులయ్యే పరిస్థితులు క్రమంగా మారిపోతున్నాయిచదువుతో సంస్కారంవిజ్ఞానంమానవతా విలువలు నేర్చుకునే పధ్ధతి ఎప్పుడో వదిలేసాము. చదువంటే పెద్ద జీతాలు వచ్చే ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన డిగ్రీలు సాధించే వ్యవస్థగా మార్చుకున్నామువిదేశీ విధానాల అనుకరణలోమన ప్రాచీన జీవన శైలి గొప్పదనాన్ని విస్మరించాము
ప్రకృతిని దైవంగా కొలిచే భారతీయ సంస్కృతినివిదేశీ వ్యాపార మాయలో పడి పూర్తిగా మర్చిపోతున్నాము.       
ఎందుకంటే మనుషుల కృత్రిమ సుఖాలకోసం పర్యావరణానికి హాని చేసే అనేక ఉత్పత్తులుప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల మార్కెట్ కలిగి ఉండటం ప్రధాన కారణం.
అంటే సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చిన ఎయిర్ కండిషనర్లురిఫ్రిజిరేటర్లుయూరియాఫెర్టిలైజర్లుపెట్రోలియం ఉత్పత్తుల అపరిమిత వినియోగంవీటలో ఒక్కటి సైతం ప్రభుత్వాలు నియంత్రించలేవు.
అదేవిధంగా ఇష్టానుసారం బోర్లు వేసి భూగర్భ జలాలను తోడెయ్యటంగ్యాస్బొగ్గుఐరన్ ఓర్ వంటి ముడి ఖనిజ సంపదను విచ్చలవిడిగా వెలికితీయటందేవదారుఎర్ర చందనం అక్రమ ఎగుమతులు నిరోధించలేకపోవటం వంటివి కూడా ప్రభుత్వాల వైఫల్యాలు.
భారతదేశంలోమన ప్రాచీనసంప్రదాయ వ్యవసాయ పధ్ధతులుప్రకృతితో మమేకమయ్యే ఆచారవ్యవహారాలతో కూడిన ప్రజా జీవన శైలిని విస్తృతరీతిలో ప్రభుత్వాలు ప్రోత్హహించాలి.

No comments:

Post a Comment