గవర్నమెంట్ సిటీస్
భారతదేశ రాజధాని, రాష్ట్రాల రాజధానులు, ఇతర ముఖ్య నగరాలూ, పట్టణాలలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల కార్యాలయాలు వేరువేరుగా విసిరేసినట్లు వివిధ ప్రాంతాలలో కొన్నిచోట్ల అద్దె భవనాలలో పని చేస్తున్నాయి. పలు ప్రభుత్వ శాఖల మధ్య పరస్పర పనుల కోసం నిరంతరం అధికారులు, ఉద్యోగులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇందుకోసం ప్రభుత్వ వాహనాలు, వాటికి డ్రైవర్లు, పెట్రోల్, డీజల్ ఖర్చు, లేదంటే అద్దె వాహనాల వినియోగం. మొత్తంగా ఈ ఖర్చంతా ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లింపులు. ఇక ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు స్వంత వాహనాల వినియోగం, ట్రాఫిక్ కష్టాలు, చివరికి ఆఫీసుకు చేరుకునేసరికి తప్పని ఆలస్యం. ఇవి ప్రభుత్వ కార్యాలయాల ద్వారా వృధా అవుతున్న ప్రజాధనం, ఇతరత్రా సమస్యలు.
ఈ సమస్యలన్నింటికి పరిష్కారం 'గవర్నమెంట్ సిటీస్' నిర్మాణం. గవర్నమెంట్ సిటీ అంటే మొత్తం అన్ని స్థాయిల్లో ప్రభుత్వ, దాని అనుబంధ కార్యాలయాలను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయటం. ఇందుకోసం ప్రస్తుత నగరానికి యాభై కిలోమీటర్ల పరిధిలోని విశాలమైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి అభివృద్ధి చేయాలి. భవనాల నిర్మాణ సమయంలోనే పర్యావరణ హితంగా, సోలార్ పవర్, ఆప్టిక్ ఫైబర్ ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ థంబ్ ఐడింటి, సి సి కెమేరా సిస్టం, వంటి సదుపాయాలు అమర్చుకోవాలి. అధికారులు, ఉద్యోగుల స్థాయిని బట్టి కార్యాలయాల వెనుక భాగంలో ఇళ్ళ నిర్మాణం చేయాలి. స్కూల్, కాలేజ్, హాస్పిటల్, ప్రార్ధనా స్థలాలు, కమ్యూనిటి హాల్స్, స్మశానం వంటి అన్ని మౌలిక వసతులు కల్పించాలి.
ఇతర ప్రాంతాలనుంచి గవర్నమెంట్ సిటీకి వాహనాలకు అతి పెద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. గవర్నమెంట్ సిటీ పరిధిలో నిరంతరం తిరిగేందుకు బ్యాటరి కార్లను ఏర్పాటుచేయాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండటం వల్ల వివిధ శాఖల మధ్య సమన్వయం కలిగి త్వరితగతిన పనులు పూర్తయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. కార్యాలయాల సమీపంలోనే నివాసాలు ఉండటం వలన ఉద్యోగులు వాక్ టు వర్క్ పద్దతిలో సమయానికి ఆఫీసులకు వచ్చే వీలు కలుగుతుంది. కంప్యుటర్ అనుసంధానిత థంబ్ ఐడింటి వలన ఉద్యోగులు ఎక్కువసార్లు ఆఫీసు నుంచి బయటికి వెళ్ళటం తగ్గించవచ్చు. ఆఫీసులలో సి సి కెమేరా సిస్టం ద్వారా లంచగొండి వ్యవస్థను నిరోధించవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానిత కంప్యూటర్ వ్యవస్థతో పని తీరుని సరళ తరం చేసి, వేగవంతం చేయవచ్చు.
అంతా బాగానే ఉంది ఇవన్నీ చేయడానికి ప్రభుత్వాల దగ్గర డబ్బు ఉండాలి కదా అనే సందేహం రావొచ్చు. నిజమే ఈ స్థాయిలో మార్పులు చేయాలంటే పెద్దమొత్తంలో నిధులు అవసరమవుతాయి. ఇందుకూ సరైన పరిష్కార మార్గం ఉంది. ప్రస్తుతం నగరంలో విస్తరించి ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాల స్వంత భవనాలను వేలం ద్వారా విక్రయించి, పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవచ్చు. కొత్త భావనాలలోకి మారిన తర్వాతే, పాత భవనాలను అప్పగించేలా వేలం సమయంలోనే ఒప్పందం చేసుకోవచ్చు. గవర్నమెంట్ సిటీ నుంచి ప్రస్తుత నగరాన్ని అనుసంధానిస్తూ లోకల్ ట్రైన్, మెట్రో రైల్ వంటి ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలి. మొత్తంగా 'గవర్నమెంట్ సిటీస్' ఏర్పాటు ద్వారా ప్రస్తుత నగర ట్రాఫిక్, కాలుష్య సమస్యలను కొంతమేరైన తగ్గించవచ్చు.
దేశం మొత్తం మీద అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల్లో జాప్యం,సిబ్బంది అలసత్వం వంటి శాశ్వతంగా వేళ్లునుకుపోయిన సమస్యలు చూస్తూనే ఉన్నాము. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం తెలుసు. ఇక ప్రభుత్వ అధికారులు లంచాలు, వాటాలు (పర్సంటేజ్), బహుమతులు కోసం వేధించటం కుడా అందరికీ అనుభవంలోకి వచ్చిన నిజమే. అయితే అధికారులు, సిబ్బంది సైతం మానవ మాత్రులే. వారికీ అనేక సాధక బాధకాలు ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం తీసుకువచ్చి, పనుల్లో జాప్యాన్ని నివారిస్తూ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పారదర్శకత సాధించేందుకు చేసిన ఆలోచనే
గవర్నమెంట్ సిటీ.
1. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు చెందిన అన్ని శాఖల కార్యాలయాలను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయటం.
2. ప్రస్తుత మహా నగరాలూ, నగరాలూ, పట్టణాలు పరిధిలోని యాభై నుంచి వంద కిలోమీటర్ల దూరంలోపు ఇందుకు అవసరమయ్యే విశాలమైన ప్రాంతాన్ని గుర్తించి అభివృద్ధి చేయాలి.
3. శాసన సభలు, శాసన మండళ్ళు, సచివాలయాలు, న్యాయస్థానాలు, వివిధ శాఖల సమావేశ మందిరాలు, వసతి గృహాలు ఈ ప్రాంతంలోనే కొత్తగా సకల ఆధునిక సౌకర్యాలతో నిర్మించాలి.
4. గవర్నరు, ముఖ్యమంత్రి మొదలు, కింది స్థాయి ఉద్యోగుల వరకూ స్థాయిల వారీగా అన్ని సౌకర్యాలతో నివాసాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు ఉద్యానవనాలు వంటి వసతులన్నీ ఇక్కడే ఏర్పాటు చేయాలి.
5. కార్యాలయాలకు నిర్మాణదశ లోనే పూర్తి ఇంటర్నెట్ అనుసంధానిత కంప్యుటర్ వ్యవస్థ, సి సి టివి సిస్టం, బయో మెట్రిక్ గుర్తింపు విధానం, క్యాంటీన్ వంటివి పొందుపరచాలి.
6. ఈ గవర్నమెంట్ సిటీ పరిధిలో ప్రయివేటు వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేదించి, కాలుష్య రహిత బ్యాటరీ కార్లు ఉచిత సర్విసులుగా నడపాలి
గవర్నమెంట్ సిటీ.
1. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు చెందిన అన్ని శాఖల కార్యాలయాలను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయటం.
2. ప్రస్తుత మహా నగరాలూ, నగరాలూ, పట్టణాలు పరిధిలోని యాభై నుంచి వంద కిలోమీటర్ల దూరంలోపు ఇందుకు అవసరమయ్యే విశాలమైన ప్రాంతాన్ని గుర్తించి అభివృద్ధి చేయాలి.
3. శాసన సభలు, శాసన మండళ్ళు, సచివాలయాలు, న్యాయస్థానాలు, వివిధ శాఖల సమావేశ మందిరాలు, వసతి గృహాలు ఈ ప్రాంతంలోనే కొత్తగా సకల ఆధునిక సౌకర్యాలతో నిర్మించాలి.
4. గవర్నరు, ముఖ్యమంత్రి మొదలు, కింది స్థాయి ఉద్యోగుల వరకూ స్థాయిల వారీగా అన్ని సౌకర్యాలతో నివాసాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు ఉద్యానవనాలు వంటి వసతులన్నీ ఇక్కడే ఏర్పాటు చేయాలి.
5. కార్యాలయాలకు నిర్మాణదశ లోనే పూర్తి ఇంటర్నెట్ అనుసంధానిత కంప్యుటర్ వ్యవస్థ, సి సి టివి సిస్టం, బయో మెట్రిక్ గుర్తింపు విధానం, క్యాంటీన్ వంటివి పొందుపరచాలి.
6. ఈ గవర్నమెంట్ సిటీ పరిధిలో ప్రయివేటు వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేదించి, కాలుష్య రహిత బ్యాటరీ కార్లు ఉచిత సర్విసులుగా నడపాలి
7. కొత్తగా నిర్మితమయ్యే గవర్నమెంట్ సిటీ నుంచి ప్రస్తుత నగరానికి మధ్య ప్రత్యేక రహదారులు, లోకల్ ట్రైన్, మెట్రో ట్రైన్ లైన్ల నిర్మాణం ద్వారా త్వరిత గతిన సౌకర్యవంతమైన ప్రయాణ వసతి కల్పించాలి.
8. గ్రామ పంచాయితీ స్థాయి నుంచి దేశ రాజధాని వరకూ అన్ని చోట్ల ఈ విధానం ద్వారా ప్రభుత్వ, పాలనా యంత్రాంగాన్ని ఒకే దగ్గరకు చేర్చాలి.
9. పదవీకాలం పూర్తైన నేతలు, అధికారులు, సిబ్బంది పరిమిత కాలవ్యవధిలో వారి వారి నివాసాలు ఖాళీ చేసేందుకు కఠిన నిభందనలు అమలు చేయాలి.
8. గ్రామ పంచాయితీ స్థాయి నుంచి దేశ రాజధాని వరకూ అన్ని చోట్ల ఈ విధానం ద్వారా ప్రభుత్వ, పాలనా యంత్రాంగాన్ని ఒకే దగ్గరకు చేర్చాలి.
9. పదవీకాలం పూర్తైన నేతలు, అధికారులు, సిబ్బంది పరిమిత కాలవ్యవధిలో వారి వారి నివాసాలు ఖాళీ చేసేందుకు కఠిన నిభందనలు అమలు చేయాలి.
ఈ తరహాలో ఏర్పాటయ్యే గవర్నమెంట్ సిటీల వలన బహుముఖ ప్రయోజనాలు సాధించవచ్చు. ప్రస్తుతం ఎక్కడెక్కడో అరకొర వసతులతో అద్దె భవంతులలో ఉన్న పలు ప్రభుత్వ శాఖలు సౌకర్యవంతమైన స్వంత భవనాలలో ఒకే చోటకు చేరుతాయి. దీనివల్ల శాఖల మధ్య తక్షణ సమన్వయంతో పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం కలుగుతుంది.
అధికారులు, సిబ్బంది ఫైళ్ళు పట్టుకుని జీపులు, కార్లు వినియోగించి వివిధ శాఖల వద్దకు తిరగవలసిన ఇబ్బంది పూర్తిగా తొలగిపోతుంది.
వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజానీకానికి కూడా మాశాఖ కాదు వేరే శాఖ అనే నిర్లక్ష్య ధోరణి ఎదురైతే, ఒకచోట నుంచి మరొక చోటుకి వ్యయ, ప్రయాసలతో తిరగాల్సిన బాధ ఉండదు. ఇంటర్నెట్ అనుసంధానిత కంప్యుటర్ వ్యవస్థతో పారదర్శకతతో పాటు పనుల్లో జాప్యం నివారించవచ్చు. మొత్తమంతా సి సి టివి వ్యవస్థ నిఘా ద్వారా పటిష్ట భద్రతతో పాటు, లంచగొండి వ్యవస్థను చాల వరకు నియంత్రించవచ్చు. బయో మెట్రిక్ గుర్తింపు విధానం, సి సి టివి వ్యవస్థ కారణంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సమయ పాలన పాటించి, ఎక్కువగా బయట తిరగకుండా వారి సీట్లలో కూర్చుని పని చేసే అవకాశం ఏర్పడుతుంది. అధికారులు, సిబ్బందికి కూడా నివాసాలు పక్కనే కాబట్టి, సిటీలో ట్రాఫిక్ ఛేదించుకుంటూ లేటుగా వచ్చే ఇబ్బంది తొలగుతుంది. అంతా బాగానే ఉంది ఇవన్నీ చెయ్యటానికి భారీగా నిధులు అవసరం కదా అనేది అందరి ప్రశ్న. అవును ఖచ్చితంగా భారీగా నిధుల అవసరముంటుంది. కానీ ప్రభుత్వాలు ఇంత స్టాయిలో నిధులు కేటాయించే స్థితిలో లేవు. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాలను గుర్తించి ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించాలి. నిధుల సమీకరణకు గ్రాంట్లు, బాండ్లు, అప్పులు, ప్రైవేట్ భాగస్వామ్యాలుతో పాటు, కొత్త ప్రత్యామ్నాయ విధానాలపై దృష్టి పెట్టాలి. ప్రస్తుత నగరాలలోని హార్ట్ ఆఫ్ సిటీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయ భవనాలు, స్థలాలు అంతర్జాతీయ వేలం ద్వారా భారీ మొత్తానికి విక్రయించవచ్చు. అంటే భూమి విలువ పూర్తిస్థాయిలో పెరిగిన ప్రాంతంలో పెద్ద మొత్తానికి అమ్మి, అతి తక్కువ భూమి విలువ కలిగిన ప్రాంతంలో గవర్నమెంట్ సిటీ నిర్మిస్తూ అక్కడి చుట్టూ పక్కల భూముల విలువని పెంచుతున్నాము.
నగరాలలో నిర్మితమయ్యే గవర్నమెంట్ సిటీలలో ఇంటర్నేషనల్ హోటల్స్, మెగా మాల్స్ నిర్మాణానికి, అవకాశం కల్పిస్తూ భారీగా నిధులు సమకూర్చుకోవచ్చు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఒకే చోట ఏర్పాటు ద్వారా పాలనాపరమయిన తక్షణ నిర్ణయాలు, సత్వర అమలు సాధ్యమవుతాయి. మొత్తంగా ప్రస్తుత నగరాలపై జనభారం తగ్గి, ట్రాఫిక్ సమస్యలు, కాలుష్య నియంత్రణకు అవకాశం కలుగుతుంది.
No comments:
Post a Comment