Friday, 25 November 2011

లాభసాటి వ్యవసాయ మార్గం


భారతదేశంలో అతిపెద్ద ఉత్పత్తిరంగం వ్యవసాయం. లాభసాటిగాలేక, ఈ రంగం అనేక ఇబ్బందుల్లోఉంది. దేశానికి అన్నంపెట్టే,రైతులు, ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుంచి, కార్పోరేట్ రంగంతో పోటీపడేలా, అన్నదాత నిలబడెందుకు, మార్గమే,
"సహకార వ్యవసాయం"

  • 1. గ్రామ రైతులందరూ కలిసి, సహకార సంఘం ఏర్పాటుచేసుకుని,ఐక్యమవటం.
  • 2.ఒక గ్రామంలోని రైతుల భూమి మొత్తాన్ని ఒక్కటిగా కలిపివేయటం.
  • 3.అందరి భూముల వివరాలను, ఆ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కంప్యూటర్లలో భద్రపరచటం.
  • 4.సంఘంలో సభ్యులందరికీ, వారి వారి భూమినిబట్టి, వాటాలు నిర్ణయించటం.
  • 5.నిర్ణీత కాలవ్యవధికి, సంఘానికి నాయకుడిని, సభ్యులను ఎన్నుకోవటం.
  • 6.పనిచేసేవారికి వారి వాటా లాభంతోపాటు జీతం, చేయనివారికి వారి వాటా లాభం మాత్రమే వచ్చే ఏర్పాటు.
  • 7.ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోవటం.
  • 8.భూమి చుట్టూ గేదెల పెంపకం, కోళ్ల ఫారాలు, గొర్రెల పెంపకం, ఇతర ఉపాధి అవకాశాలు పెంచుకోవటం.
  • 9.వాటినుంచి వచ్చే మల, మూత్ర, వ్యర్ధాలు పంట భూమిలో అన్నివైపులకు వెళ్లేవిధంగా ఏర్పాట్లు.
  • 10.సహజసిద్ధ ఎరువుల వినియోగం, అదనపు పంటలు వేయటం.
  • 11.సంఘం స్థాయినిబట్టి, నెమ్మదిగా స్వంతంగా మిల్లులు, ఫుడ్ ప్రోసెసింగ్ ఏర్పాట్లు.
  • 12.బిందు సేద్యం, భూమి మొత్తానికి తక్కువ నీటి వినియోగం, వర్షపునీటి నిల్వకు ఏర్పాటు.
  • 13.వీటి అన్నింటికీ, సంఘం ద్వారా అందరి భూమి తనఖాతో బ్యాంకు నుంచి ఋణం.
  • 14.పండిన పంటలో కొంత, సభ్యుల సొంతానికి కావాలంటే, సబ్సిడీ ధరకు ఇచ్చే ఏర్పాటు.
  • 15.మొత్తం భూమిలో వేసిన పంట అంతటికి, బీమా చేసుకోవటం.
  • ఈవిధానంతో, వ్యవసాయం నుంచి దూరమవుతున్న కొత్త తరానికి ఆహ్వానం పలికి కార్పోరేట్ స్థాయికి తీసుకువెళ్ళవచ్చు.
చిన్న చిన్న కమతాలను మొత్తంగా కలిపి, భూమిని ఒక్కటిగాచేయటం ద్వారా, ఒకేసారి విత్తనాలు, నీరు, విద్యుత్
సమకూర్చుకోవటం తేలిక అవుతుంది. బ్యాంకు రుణాలకోసం విడి,విడిగా తిరగటం కన్నా, ఈ విధానంలో బ్యాంకులే సంఘాలవద్దకువచ్చి రుణాలిచ్చే అవకాశముంది.
పంటని అమ్ముకోవటం లోనూ డిమాండ్ ఏర్పడే అవకాశముంది.
కొన్ని సంవత్సరాలలోనే స్వంతంగా మిల్లులు, ఫుడ్ ప్రోసెసింగ్
ఏర్పాట్లు చేసుకుంటే సంఘం ద్వారా చాలా మందికి ఉద్యోగ
అవకాశాలు వస్తాయి. సమిష్టి ఉత్పత్తి దేశాన్ని బలోపేతం చేస్తుంది. palekarzerobudgetnaturalfarming.com


    No comments:

    Post a Comment