Thursday, 24 November 2011

విదేశీ వ్యామోహం - నిరుద్యోగ భారతం

దేశంలో ధనికులనుంచి,  సామాన్యుడి ఇంట్లో సైతం, వాడుకలో ఉన్న లక్జరికార్లు, బైకులు, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్లు, కంప్యుటర్ పరికరాలు   టివిలు,రిఫ్రిజిరేటర్లు, వంటివన్నీ, ఎక్కడనుంచి తయారైనవి వాడుతున్నామో పరిశీలిస్తే, ఈ దేశంలో నిరుద్యోగులు ఎందుకు పెరుగుతున్నారో అర్ధమవుతుంది. 

విదేశీవస్తువుల వాడుకే, స్టేటస్ సింబల్గా  మార్చివేసినధనికవర్గాలు, సగటు జనానికికూడా, ఆ వేలంవెర్రి, వేళ్ళునుకునేలా పెంచేసారు. 

దేశీయ ధనాన్ని, విదేశాలకు నిలువు దోపిడీ సమర్పించుకుంటున్నామన్న ఆలోచన లేకుండా, మనదేశపు,ఉత్పాదక, ఉపాధిరంగాలని , మనమే నిర్లక్ష్యం చేస్తున్నాము. ఫలితంగా, ఈ దేశపు,యువతను నిరుద్యోగులుగా నిర్వీర్యం చేస్తూ, విదేశీ కూలీలుగా మారేందుకు,ఉరకలెత్తేలా, ప్రోత్సహించటం శోచనీయం .
                

No comments:

Post a Comment