Wednesday, 18 November 2015

MAMAMAJAKA MANI

Friday, 13 November 2015

రైల్ పవర్

            
"రైల్ పవర్"
భారతదేశం అన్నిరంగాలలో అభివృద్ధి సాధించాలంటేముందుగా విద్యుత్ ఉత్పాదనలో స్వయంసంవృద్ధి సాధించాలి
అధిక స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికికాలుష్యకారకమైన సంప్రదాయ పద్ధతులను వదిలేసిపర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని కొత్త విధానాలను రూపొందించాలికొత్త ఆవిష్కరణలకు అవసరమైన పరిశీలనపరిశోధనలకు ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ప్రోత్సాహాన్నిసహకారాన్ని అందించాలిదేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కాలుష్య రహితనిరంతర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కలిగిన ఒక కొత్త ఆలోచనను మీముందుకు తెస్తున్నాముదీనిని "రైల్ పవర్గా వ్యవహిరిద్దాము.  
భారతీయ రైల్వే ద్వారా దేశం మొత్తం విస్తరించి ఉన్న రైల్వే ట్రాకుల నుంచి విద్యుత్ ఉత్పాదనకు పూర్తి అవకాశాలు ఉన్నాయి
 రైల్వే ట్రాకుల మీదుగా టన్నులకొద్దీ బరువుతోవేగంగా గూడ్స్ప్యాసింజెర్ రైళ్ళు ప్రతిరోజూ రాక పోకలు సాగిస్తూ ఉంటాయి
బరువుతో కూడిన  రైళ్ళ రాకపోకల ద్వారా రైలుపట్టాల క్రింది భాగంలో విపరీతమైన వత్తిడి ఏర్పడుతుంది వొత్తిడిని శక్తి గా మలిస్తే విద్యుత్ ఉత్పాదనకు అవకాశం ఏర్పడుతుంది
రైలు పట్టాల క్రింద ఆధారంగా ఉండే స్లీపర్ దిమ్మలు  వొత్తిడిని నిరోధిస్తాయిఅంటే రైలు పట్టాలపై పడే భారాన్నిక్రింది స్లీపర్ దిమ్మలు ప్రతిఘటిస్తాయి రెండిటి మధ్యన జరిగే చర్యప్రతిచర్య ఫలితంగా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కలుగుతుందిఇందుకు సంబందించి పూర్తి స్థాయిలో పరిశోధనలుపరిశీలనలు చేయవలసిన అవసరం ఉన్నది.
 "రైల్ పవర్పరిశోధనకు కనీసం వంద కిలోమీటర్లఎటువంటి అంతరాయంలేని  రైల్వే ట్రాక్ అవసరమవుతుంది ట్రాక్ పై తక్కువ బోగీలతోలోడ్ చేయని గూడ్స్ రైలు తక్కువ వేగంతో నడిపిఏమేరకు విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందో పరిశీలించాలిఅలాగే ఎక్కువ బోగీలతో సరుకు లోడ్ చేసిన గూడ్స్ రైలును ఎక్కువ వేగంతో నడిపిప్రయోగ ఫలితాలు బేరీజు వేయాలి.
ఈవిధంగా రైల్వే ట్రాక్ పై ఎన్ని టన్నుల బరువుతోఎంత వేగంతో వెళితేఏస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఏర్పడుతుంది అనే సంపూర్ణ ప్రయోగ ఫలితాలను నమోదు చేయవలసి ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పాదనపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయికానీ ఎక్కడా "రైల్ పవర్వినియోగంలో లేదుపూర్తి స్థాయి పరిశోధనలు జరగలేదుబహుశా ఇందుకు కారణం ఆయా దేశాల్లో విద్యుత్ కొరత లేకపోవటం అయి ఉండవచ్చుమరొక ప్రధాన కారణం "రైల్ పవర్పరిశోధనపరిశీలనకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పన కష్ట సాధ్యమైన విషయం కావటంపరిశోధన ఫలించినాఅమలు పరిచేందుకు మరికొన్ని సమస్యలు ఎదురవుతాయిరైల్వే లైన్ల వెంట ఎటువంటి రక్షణా వుండదుట్రాక్ మొత్తం స్లీపర్ల కింద విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసే పరికరాలకు భద్రత ఉండదుఅలాగే  పరికరాలు ఎండాకాలంవర్షాకాలంశీతాకాలం వంటి అన్ని వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది.
ముఖ్యంగా ప్రయాణీకుల రైళ్ళలో టాయిలెట్ల నుంచి వ్యర్ధాలు నేరుగా ట్రాక్ మధ్యన స్లీపర్ల మీదే పడుతుంటాయిఅయితే ఇవన్నీ అధిగమించలేని పెద్ద సమస్యలేమీ కావు.           
అయితే భారతదేశంలో "రైల్ పవర్పరిశోధనకు పెద్దమొత్తంలో ఖర్చు చేయవలసిన అవసరం లేకుండాఅన్ని వనరులుమౌలిక సదుపాయాలు సమకూర్చి ఉన్నాయికేవలం భారత ప్రభుత్వ చొరవప్రోత్సహం ఉంటె చాలు
భారతీయ రైల్వేలో భాగంగా ఉన్న  'DFCCIL' Dedicated Freight Corridor Corporation of India వారి ద్వారా గూడ్స్ రైళ్ళ కోసం నిర్మిస్తున్న ప్రత్యేక రైల్వే ట్రాక్స్ కొన్నిభూమి లభ్యత లేని కారణంగా అసంపూర్ణంగా ఆగిపోయాయి
వీటిలో వంద కిలోమీటర్ల పైన నిర్మాణం పూర్తి అయిన ట్రాక్స్ ఉన్నాయి ట్రాక్స్ ను ఒక సంవత్సర కాలం వరకూ "రైల్ పవర్పరిశోధనకు కేటాయిస్తేతక్కువ ఖర్చుతో ప్రపంచంలోనే ఒక కొత్త ఆవిష్కరణకు ప్రాణం పోయవచ్చువిశ్వమంతా ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్య సమస్యకుసరికొత్త పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తితో శాశ్వత పరిష్కారం చూపవచ్చు
భారత ప్రభుత్వం ప్రతిపాదించిన 'అటల్ ఇన్నోవేషన్ మిషన్కార్యక్రమాన్ని "రైల్ పవర్పరిశోధన ద్వారా ప్రారంభించాలని మా వినతి.
ఇదంతా ఖర్చుతో కూడిన ప్రక్రియ అయినప్పటికీదేశ విద్యుత్ 
అవసరాలను గుర్తించి ముందడుగు వేయాలికాలుష్య రహితంగాపెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్న ఇటువంటి సాంకేతికతను అభివృద్దిపరచి ఉపయోగించుకోవాలి.