Tuesday, 16 October 2018

ఐకమత్యమే అవసరం

ఐకమత్యమే అవసరం 

అమెజాన్, ఊబర్ వంటి విదేశీ కంపెనీలకు మనదేశ జనాభా అనైక్యతే పెట్టుబడి.

మనకి చిన్నతనంలోనే ఐకమత్యం గొప్పతనం వివరించినా, ఆచరణలో పాటించకపోవటమే ఈ దుస్థితికి కారణం. 
వాళ్ళనెందుకు అనాలి? నిజమే, వినియోగదారుడిగా నాణ్యతతో, తక్కువ ధరకి ఇస్తే, ఎవరైతే నాకేంటి. ఇందుకే కొంచెం 
ఆలోచించాలి... 
చిన్న షాపు కూడా లేని అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటివి వేలకోట్ల వస్తువులు అమేస్తాయి.
అసలు టి వి ఛానల్ లేని టాటా స్కై, ఎయిర్టెల్ డిటిహెచ్ లతో దండుకుంటున్నాయి. 
ఒక్క సొంత కారూ లేని ఉబర్, ఓలా లు కోట్ల రూపాయల ట్రాన్స్ పోర్ట్ సేవలందిస్తాయి.
టీ కొట్టు లేని స్విగ్వి, జొమోటో లాంటివి ఇంటింటికి ఆహారం పంపుతూ, లాభాలు గడిస్తాయి.    
ఎలక్ట్రీషన్, ప్లంబర్ లాంటి వారిని అర్బన్ క్లాప్ పంపి కమిషన్లు ఆర్జిస్తుంది. 

టెక్నాలజీ పెరిగింది... ఇలా చాలా సంస్థలు చేతికి మట్టి అంటకుండా, అకౌంట్లో డబ్బులు పడే వ్యాపారాలతో ఎదిగిపోతున్నాయి. 

ఈ సంస్థలకు మూలమైన ఉత్పత్తి దారులు కానీ, సేవలను అందించే వారు కానీ, ఐక్యంగా అదే టెక్నాలజీతో సొంతగా సంస్థలు ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు?  
ఉదాహరణకు...
1. ఒక ప్రాంత చిన్న వ్యాపారులు అందరూ కలిసి, ఒక మాల్ ద్వారా తక్కువ ధరలకే విక్రయాలు జరుపవచ్చు. 
2. టాక్సీ ఓనర్లు, డ్రైవర్లు కలిసి సొంత యాప్ ద్వారా, తక్కువ రేటుకు సేవలందిస్తూ, ఊబర్, ఓలా లను నియంత్రించవచ్చు.
3. ఒక గ్రామ రైతులంతా తమ భూమిని కలిపేసి, సహకార సేద్యంతో లాభసాటిగా వ్యవసాయం చేయవచ్చు.

ఐక్యముగా ఇలా ఎన్నో అవకాశాలు సృష్టించుకోవచ్చు.
కుటుంబాలైన, సమాజాలైనా, మనుషుల మధ్య ఐక్యత ఉంటే అద్భుతమే.