Friday, 16 November 2012

కాంట్రాక్ట్ కంట్రీ

భారతదేశంలో గ్రామాలలో చిన్న రోడ్ వేయటం నుంచి, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం వరకు అన్నీ కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయి. ప్రజల నుంచి అనేక రూపాలుగా పన్నులు వసూలు చేసే ప్రభుత్వాలు ఆ డబ్బును ఇందుకు వినియోగిస్తున్నాయి. అయితే ప్రజా అవసరాలకు ప్రభుత్వాలు చేసే ఈ నిర్మాణాల్లో నాణ్యత లేకపోవటం పెద్ద సమస్యగా మారింది. 

ఇందుకు కాంట్రాక్ట్ వ్యవస్థ ప్రధాన కారణం. ప్రజల డబ్బును జీతాలుగా తీసుకునే ప్రభుత్వ అధికారులు, మంత్రుల వత్తిడికి, లంచాల ప్రలోభాలకు లొంగిపోయి అర్హత లేని సంస్థలకు పెద్ద పెద్ద కాంట్రాక్టు పనులు అప్పగించి నాణ్యతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నారు.

రాజకీయ పలుకుబడి అడ్డం పెట్టుకుని తమకు, తమవారికి పెద్ద కాంట్రాక్టు పనులు దక్కించు కోవటానికే ఎక్కువమంది రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇక టెండర్ ప్రక్రియ నుంచి అన్ని స్థాయిల్లో వాటాలు పంచటం అందరికి తెలిసిన చేదు నిజం. తర్వాత పనిని విభజించి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వటం, తక్కువ కూలికి పనిచేసేవారిని, బాలకార్మికులను  బీహార్, ఒరిస్సా, అస్సాం నుంచి తీసుకువచ్చి శ్రమ దోపిడీకి పాల్పడటం సాధారణ ప్రక్రియగా మారింది. ఎక్కువ లాభాలకోసం నాణ్యతను పట్టించుకోకుండా పై పై మెరుగులతో పేక మేడల్లా నిర్మాణాలు చేయటం, అతి తక్కువ కాలానికే అవి కూలినా, కొట్టుకుపోయినా ఎంక్వయిరి కమిషన్ల పేరుతొ కాలయాపన చేయటం ప్రస్తుత కాంట్రాక్ట్ వ్యవస్థ నిజ స్వరూపం.

అంటే అందరికి జీవనోపాధి చూపవలసిన ప్రభుత్వాలే కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా అసంఘటిత రంగాన్ని ప్రోత్సహించటం సిగ్గుచేటైన వ్యవహారం.       
ప్రజలనుంచి అనేకరూపాలలో పన్నులు వసూలుచేస్తున్న ప్రభుత్వాలు, ఆ డబ్బును ప్రజా అవసరాల కోసం మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తున్నామని చెబుతూ,  అసంఘటిత రంగ  కాంట్రాక్ట్ వ్యవస్థలకు ఎందుకు ధారా దత్తం చేయాలి. 
అస్సలు చదువులేని కూలీ నుంచి ఉన్నత విద్యార్హతలు కలిగిన వారందరికీ, ఈ పోర్టల్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలి.
'జన శక్తి' ద్వారానే పనివారిని పిలవాలి. రెండవది 'పని కోరేవారు' అంటే దేశం మొత్తంగా వయసు, అర్హతలతో నిమిత్తం లేని నిరుద్యోగులు. ప్రభుత్వాలు చేపట్టే ఏ నిర్మాణ పనులకైనా టెండర్ ప్రక్రియ ద్వారా కాంట్రాక్టరుకు అప్పగిస్తారు. అంటే ఆ పనియొక్క పూర్తి వివరాలను ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు కలిగి ఉంటారు. అదే సమాచారాన్ని నిర్దేశిత విధానంలో 'జన శక్తి' పోర్టల్ లో ఎంటర్ చేస్తే, దానిలో పొందుపరిచిన సాఫ్ట్ వేర్ ద్వారా విశ్లేషించుకుని, వివిధ స్థాయిల్లో ఆయా ప్రాంతాలలో అవసరమైన పని వారి జాబితా రూపొందిస్తుంది. అంతేకాదు ఆటోమేటిక్ గా వారందరికీ మెసేజ్, మెయిల్స్ పంపిస్తుంది. వారంలోపు వారి సమ్మతితో రిప్లై రాకుంటే లిస్ట్ లో సెకండ్ ప్రయారిటీ వారిని గుర్తించి, సమాచారం వెళుతుంది. 
ఇదే తరహాలో ఆయా పనులకు అవసరమయ్యే రా మెటీరియల్ అంటే స్టీల్, సిమెంట్, రాయి, ఇసుక వంటివన్నీ సప్లై కోరుతూ మరొక వెబ్ సైట్ మరియు యాప్ రూపొందించాలి. అందులోనే క్రేన్స్, జె సి బి లు, ట్రక్కులు, ఇతర భారీ నుంచి చిన్నతరహా వరకూ అన్ని రకాల పనిముట్లు సప్లై కోరేవిధంగా ఉండాలి. ఇందులోకూడా సప్లై కోరేవారు, సప్లై చేసేవారు అనే రెండు విభాగాలు ఉంటాయి. 
కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా కలుగుతాయి.                                               

Sunday, 19 August 2012

మార్పు మనతోనే ...

ప్రపంచంలో ఎక్కడైనా మంచి చెడు రెండూ  ఉంటాయి. అవి ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా కొట్లాడుకుంటాయి. ఈ యుద్ధంలో గెలిచేది మంచా, చెడా అనేది మనిషి పైనే ఆధారపడి ఉంటుంది. మనిషి తనలోనే ఉన్న మంచి, చెడులలో దేనిని పెంచి పోషిస్తే, అది బలీయంగా మారి రెండవదాన్ని అంతమొందిస్తుంది. చెడును పెంచుకుంటూ వెళితే, అది మనిషినే మింగేసి, సమాజానికి శాశ్వత శత్రువుని చేస్తుంది. మంచిని పెంచుకుని, పంచితే అదే మనిషి ఉన్నతుడిగా మారి తరతరాలకు సమాజం కీర్తించే మహానీయుడవుతాడు. చెడు పైన మంచి విజయం సాధించేందుకు మనుషులుగా మన ప్రయత్నం నిరంతరం కొనసాగిద్దాము.         సమాజంలో చెడు ఎక్కువైనప్పుడే అన్ని రకాల సమస్యలు వస్తాయి. అందరూ మంచివారే, కాని పరిస్థితుల ప్రభావంతోనో, అనాలోచిత స్వార్ధం వల్లనో చెడు వైపు వెళుతుంటారు. అయితే భారతదేశంలోని ఎక్కువశాతం ప్రజలు అందులో భాగమైన నాయకులు, అధికారులతో సహా ఎవరి స్థాయిలో వారు అవినీతిలో కూరుకు పోవటం కాదనలేని నిజం. వీరందరూ (మనమందరం) తప్పు చేస్తున్నామని తెలిసినా, లోకమంతా అలాగే ఉందికదా అని సమర్ధించుకుంటారు. మరికొందరు డబ్బు, అధికారం లేకపోతే మనిషికి ఏమాత్రం విలువ ఉండదని, వాటి కోసం ఎంతకైనా తెగించవచ్చని వాదిస్తారు. ఇంకొందరు ఈ కలియుగ ధర్మంలో మంచి పనికిరాదని, కొత్త వేదాంతం చెబుతారు. అందరూ అలానే ఉన్నప్పుడు,మనం మాత్రమే మంచికిపోతే చేతగాని వారిగా వెనకపడి పోతామనేవారూ ఉన్నారు. కొందరైతే వ్యవస్థలో మార్పు రాకుండా వ్యక్తులు మారటం కష్టం అంటున్నారు.  
  

ఇలా ఎవరి కారణాలు వారికున్నాయి. మనిషి సంఘ జీవి అని ఎప్పుడో చదువుకున్నాం. దాన్ని లోతుగా పరిశీలన చేస్తే, ప్రతి మనిషి తను ఒక్కడు, తర్వాత తన కుటుంబం, అలాంటి అనేక కుటుంబాలు కలిస్తే సమాజం, ఈ సమాజాల సమూహమే ప్రాంతం, రాష్ట్రం, దేశం, ప్రపంచం. అసలు ఈ సమాజం అనేదే లేకుండా మనం ఒక్కరమే సకల సంపదలు, అన్ని సౌకర్యాలు స్వంతం చేసుకున్నప్పటికీ ఆనందంగా ఉండగలమా? అంటే అలా ఊహించటానికి కూడా భయపడే చేదు నిజం.  

                                              


అయితే మొత్తంగా అందరూ వ్యవస్థలో మార్పు రావాలని మాత్రం కోరుకుంటున్నారు. ఉన్నత స్థాయిలోని విశ్వసనీయమైన వ్యక్తులెవరైనా ముందుకొచ్చి మంచి వైపు ప్రేరణ కలిగిస్తే మారేందుకు అందరూ సిద్ధమే.



ఈ నిస్తేజ స్థితి నుంచి చైతన్యవంతులయ్యే మార్పు కోసం నిస్వార్థ పరులు, మంచి ఆలోచనలు కలిగిన వారంతా ఏకం కావాలి. ప్రతి వ్యక్తి ముందు తనలో మంచి వైపు మార్పు ద్వారానే, సమాజం మొత్తంలో  మార్పు వస్తుందనే  సత్యాన్ని ఆచరణ ద్వారా చాటి చెప్పాలి.  అలాంటి మార్పుకు అనుకూలమైన సామాజిక వ్యవస్థను మనతరం నిర్మించుకోవటం ప్రస్తుత అవసరం. అప్పుడు మాత్రమే మన భవిష్యత్ తరాలు ఆ మంచి బాటలో నడిచి. ఉత్తమ పౌరులుగా భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలుపుతారు.                           

Thursday, 26 July 2012

విలువల్లేని విద్య





ప్రపంచ ఆర్దిక వ్యవస్థకు మూలమైన ఎన్నో విషయాలు భారత ప్రాచీన విద్యా విధానం ద్వారా రూపొందినవే. సున్నా (జీరో) కనుగొనటం నుంచి రాజనీతి శాస్త్రం వరకు ఎన్నింటినో మన పూర్వీకులు స్పష్టమైన వివరాలతో భావితరాలకి అందించారు. అద్భుత కట్టడాలను అలవోకగా నిర్మించిన ఇంజనీరింగ్ ప్రతిభ అప్పటికే మన సొంతం. అరవైనాలుగు కళలలో ఆరితేరిన నైపుణ్యం భారతీయులది. ఖగోళ విజ్ఞానం, సూర్య, చంద్ర, నక్షత్ర గమనాలను లెక్కలు కట్టి పౌర్ణమి , అమావాస్య, గ్రహణాలను చెప్పిన చరిత్ర మనది.
అయితే బ్రిటీష్ వారి బానిసత్వంలో మనదేశంలోకి విదేశీ విద్యావిధానం చొరబడింది. మంచి ఎక్కడున్నా నేర్చుకోవటం తప్పుకాదు. కానీ మన ఉనికి మరచి వాళ్ళ విధానాలకు ఆకర్షితులయ్యాము. ఫలితంగా విద్య ద్వారా విజ్ఞానవంతులయ్యే పరిస్థితులు క్రమంగా మారిపోతున్నాయి. చదువుతో సంస్కారం, విజ్ఞానం, మానవతా విలువలు నేర్చుకునే పధ్ధతి ఎప్పుడో వదిలేసాము. చదువంటే పెద్ద జీతాలు వచ్చే ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన డిగ్రీలు సాధించే వ్యవస్థగా మార్చుకున్నాము.