Tuesday, 16 October 2018

ఐకమత్యమే అవసరం

ఐకమత్యమే అవసరం 

అమెజాన్, ఊబర్ వంటి విదేశీ కంపెనీలకు మనదేశ జనాభా అనైక్యతే పెట్టుబడి.

మనకి చిన్నతనంలోనే ఐకమత్యం గొప్పతనం వివరించినా, ఆచరణలో పాటించకపోవటమే ఈ దుస్థితికి కారణం. 
వాళ్ళనెందుకు అనాలి? నిజమే, వినియోగదారుడిగా నాణ్యతతో, తక్కువ ధరకి ఇస్తే, ఎవరైతే నాకేంటి. ఇందుకే కొంచెం 
ఆలోచించాలి... 
చిన్న షాపు కూడా లేని అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటివి వేలకోట్ల వస్తువులు అమేస్తాయి.
అసలు టి వి ఛానల్ లేని టాటా స్కై, ఎయిర్టెల్ డిటిహెచ్ లతో దండుకుంటున్నాయి. 
ఒక్క సొంత కారూ లేని ఉబర్, ఓలా లు కోట్ల రూపాయల ట్రాన్స్ పోర్ట్ సేవలందిస్తాయి.
టీ కొట్టు లేని స్విగ్వి, జొమోటో లాంటివి ఇంటింటికి ఆహారం పంపుతూ, లాభాలు గడిస్తాయి.    
ఎలక్ట్రీషన్, ప్లంబర్ లాంటి వారిని అర్బన్ క్లాప్ పంపి కమిషన్లు ఆర్జిస్తుంది. 

టెక్నాలజీ పెరిగింది... ఇలా చాలా సంస్థలు చేతికి మట్టి అంటకుండా, అకౌంట్లో డబ్బులు పడే వ్యాపారాలతో ఎదిగిపోతున్నాయి. 

ఈ సంస్థలకు మూలమైన ఉత్పత్తి దారులు కానీ, సేవలను అందించే వారు కానీ, ఐక్యంగా అదే టెక్నాలజీతో సొంతగా సంస్థలు ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు?  
ఉదాహరణకు...
1. ఒక ప్రాంత చిన్న వ్యాపారులు అందరూ కలిసి, ఒక మాల్ ద్వారా తక్కువ ధరలకే విక్రయాలు జరుపవచ్చు. 
2. టాక్సీ ఓనర్లు, డ్రైవర్లు కలిసి సొంత యాప్ ద్వారా, తక్కువ రేటుకు సేవలందిస్తూ, ఊబర్, ఓలా లను నియంత్రించవచ్చు.
3. ఒక గ్రామ రైతులంతా తమ భూమిని కలిపేసి, సహకార సేద్యంతో లాభసాటిగా వ్యవసాయం చేయవచ్చు.

ఐక్యముగా ఇలా ఎన్నో అవకాశాలు సృష్టించుకోవచ్చు.
కుటుంబాలైన, సమాజాలైనా, మనుషుల మధ్య ఐక్యత ఉంటే అద్భుతమే.

Thursday, 27 September 2018

"పున్నమి (పూర్ణిమ)(పౌర్ణమి) వెన్నెల పండుగ"


           "పున్నమి (పూర్ణిమ)(పౌర్ణమి) వెన్నెల పండుగ" 
           ఏమిటిమనం జరుపుకునే అన్నిపండుగల ముఖ్య ఉద్దేశ్యం గమనిస్తేపర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకునిసామాజిక హితం కోరుతూనిరంతరాయంగా జనం ఆచరించేందుకు మన పూర్వికులు ఏర్పరిచి ఉంటారని అర్ధం చేసుకోవచ్చు.

అదే ఆలోచనతో రూపుదిద్దుకున్నది "పున్నమి (పూర్ణిమ)(పౌర్ణమి) వెన్నెల పండుగ" ప్రతిపాదన.
 ప్రతినెలలో వచ్చే పూర్ణిమ రోజు రాత్రి చంద్రుని వెన్నెల కాంతిలోవిద్యుత్ నిలిపివేసి జనమంతా ఆహ్లాదంగా పండుగ జరుపుకోవటమే దీని ప్రత్యేకత.

ఎందుకు: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువశాతం విద్యుత్ ఉత్పత్తి శిలాజ ఇంధనమైన బొగ్గు ద్వారానే జరుగుతోందిటెక్నాలజీ పెరిగిపోయిన ప్రస్తుత సమాజంలో విద్యుత్ అవసరం గణనీయంగా పెరుగుతోంది.
మరోవైపు శిలాజ ఇంధనాలు తరిగి అడుగంటిపోతున్నాయి.
ఈనేపథ్యంలో విద్యుత్ వినియోగంలో పొదుపు అందరి బాధ్యతగా గుర్తించాలి. ఇందుకు నిర్బంధ విధానాలకన్నా, సామజిక భాగస్వామ్యంతో ప్రతినెలా ఒకరోజు పూర్ణిమ రాత్రి వెన్నెలలో పండుగ జరుపుకోవటం అత్యుత్తమ మార్గము.


ఎలాప్రతినెలా పున్నమి రోజు రాత్రి ఏడు గంటలనుంచి పదకొండు గంటల మధ్య విద్యుత్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసిఅపార్ట్ మెంట్ అసోసియేషన్లురెసిడెన్షియల్ కాలనీ సొసైటిలుసాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ సంస్థలురోటరీ క్లబ్లులయన్స్ క్లబ్లుఇన్నర్ వీల్ క్లబ్లు ఇలా జన భాగస్వామ్యం కలిగిఉన్నఅన్ని సంస్థలుసంఘాలు  పండుగలో పాల్గొనే విధంగా అవగాహన కల్పించాలి
పున్నమి వెన్నెల పండుగను అపార్ట్ మెంట్ టెర్రస్  పైనఆరు బయట స్థానిక ఖాళీ ప్రదేశాలలోఆట స్థలాలుఉద్యాన వనాలలోఏవిధమైన విద్యుత్ దీపాలు వినియోగించకుండాఆరుబయట పూర్తివెన్నెల కాంతిలో  పండుగను నిర్వహించాలనేది ఇందులో అతిముఖ్యమైన నిబంధన. 
అర్బన్ ప్రాంతాలలో పౌర్ణమి రాత్రి వీధి దీపాల నిలుపుదల ద్వారా భారీగా విద్యుత్ పొదుపు చేయవచ్చు.

ఎవరు ఇందులో కుల,మతప్రాంతవర్ణవర్గ విభేదాలకు అవకాశం ఇవ్వకుండాలింగ బేధాలువయసు తారతమ్యాలు లేకుండావిశ్వవ్యాప్తంగాసర్వ మానవాళి సంతోషంతో భాగస్వాములు కావచ్చు.  
ఐక్య రాజ్య సమితి, యునెస్కో, వంటి పెద్ద సంస్థల సహకారంతో ప్రపంచమంతా జరుపుకునేలా ప్రచారం చేయవచ్చు.
 దేశాల అధ్యక్షులుప్రధానమంత్రులుముఖ్య మంత్రులుమంత్రులుగవర్నెర్లుకలెక్టర్లుమేయర్ల సహకారం కోరివారంతా పాల్గొని ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు కృషి చెయ్యాలి
ఆత్యాధ్మిక వేత్తలు, మత పెద్దలు, శాంతి కాముకులు, పర్యావరణ హితులతో, సామాన్యులలో 'పున్నమి వెన్నెల పండుగ'పై అవగాహన కల్పించవచ్చు. సినిమా, క్రీడారంగ సెలబ్రెటీలతో అవగాహనా ప్రచారం జరపాలి.

ఎక్కడ: వెన్నెలలో నదులులేక్ లలో పడవలపై విహారాలుఇసుక తిన్నెల్లో విందులుసాగరతీర బీచ్లలో ప్రత్యేక ఏర్పాట్లు, సంగీత విభావరులు నిర్వహించవచ్చు.  
హోటల్ రెస్టారెంట్ నిర్వాహకులతో అవగాహన ద్వారా పున్నమి వెన్నెల్లో విందులు. 

ఏంలాభం: ప్రపంచమంతా  పండుగ నిర్వహణ ద్వారా విద్యుత్ పొదుపు తద్వారా పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశ్యము.  దీనితోపాటు నేటి తరానికి అవసరమయ్యే ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశలున్నాయి.యాంత్రిక జీవనంలో భాగమైపోతున్న ప్రస్తుత తరానికిసాముహిక సమావేశాలతో మానవ సంబంధాలువాటి విలువ తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది.
 డి జె సౌండ్స్ మోతతో శబ్ద కాలుష్యాన్ని సృష్టించటం మానేసిసమూహాల్లోని వ్యక్తులువారి పిల్లలలో అంతర్గతంగా దాగిన సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించవచ్చుసాముహిక వెన్నెల రాత్రి భోజనాలతో మనుషుల మధ్య అంతరాలను తగ్గిస్తూసామాజిక సమానత్వ భావాన్ని చాటి చెప్పవచ్చు
మొత్తంగా నెలలో ఒక్కసారి అయినా, చుట్టు పక్కల వారిని కలిసి మంచి చెడులు నేరుగా మాట్లాడుకునే వేదికలుగా ఉపయోగించుకోవచ్చు.

నెలకొకసారి వ్యక్తులుకుటుంబాల మధ్య ముఖాముఖీ కలయికపరస్పర సమావేశములువారి ప్రతిభా పాటవాలను చాటుకునేలా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణసత్స్ంగములుసహపంక్తి భోజనాలు వంటివెన్నో  వెన్నెల రాత్రిలో ఆనందంగా నిర్వహించుకోవచ్చుఅనేక రంగాలలో తీవ్ర పని వత్తిడికి గురవుతున్న నేటి తరం వెన్నెల కాంతిలో మానసిక ప్రశాంతత పొందవచ్చు.చంద్ర కాంతితో అనేక మానసిక రుగ్మతలు దూరమవుతాయి.వెన్నెల కిరణాలతో దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయమవుతాయి. దీని ద్వారా టివీ లు, కంపూటర్లు, మొబైల్ ఫోన్ల మధ్య చిక్కుకుపోతున్న భవిష్యత్ యువ తరానికి, పున్నమి వెన్నెల కాంతితో ఆహ్లాదాన్ని, ప్రకృతి పరిమళాన్ని అనుభూతి చెందేలా ప్రోత్సహించవచ్చు.  మొత్తంగా భావితరాలకు విద్యుత్ పొదుపు, వెన్నెల హాయి పట్ల మక్కువ కలిగేలా చేయటం. 
  
 విధానాలను ఆచరణాత్మకంగా అమలు చేయటం ద్వారా పర్యావరణ పరిరక్షణలో యావత్ ప్రపంచానికి భారత దేశం నేతృత్వం వహించిమార్గనిర్దేశం చేస్తూ ఆదర్శంగానిలవటం తధ్యం.